MLC VOTER REGISTRATION PROCESS
అందరికీ నమస్కారం.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ను ఎలా చేయాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం.
Steps
1. దీనికోసం ముందుగా https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html సైట్ లో వెళ్లాలి తర్వాత మీరు ఒకవేళ మొబైల్లో చేయాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత Desktop mode ను సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సైట్లో మనకు ఈ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయగానే మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి అసెంబ్లీ కాన్స్టెన్సీ రెండు కౌన్సిల్ కాన్స్టెన్సీ దానిలో కౌన్సిల్ కాన్స్టెన్సీ ఎంచుకోండి తదుపరి గ్రాడ్యుయేట్స్ (ఫార్మ్ 18) అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేయండి తర్వాత దానిలో మీ మీ డీటెయిల్స్ ను ఫిల్ చేయవలసి ఉంటుంది దానిలో మెయిన్ గా మొదట కొన్ని ఆప్షన్స్ లో ఇంగ్లీషులోనూ తర్వాత కింద తెలుగులోనూ టైప్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఎలక్షన్ కార్డు డీటెయిల్స్ తో కానీ ఎలక్షన్ కార్డు డీటెయిల్స్ లేకుండా కానీ చేయవచ్చు.
2. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ఒరిజినల్ లేదా ప్రొవిజనల్ కాపీని మరియు మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫోటో అయితే 100kb లోపల మరియు మరియు ప్రొవిజినల్ లేక OD attested కాపీ 200kb ఉండాలి ఒకవేళ మీ యొక్క డాక్యుమెంట్ సైజు ఈ రిక్వైర్మెంట్లలో లేకపోతే ఈ లింకు ద్వారా మీరు మీకు కావాల్సినట్టు కంప్రెస్ చేసుకోవచ్చును.
https://compress-or-die.com/jpg
3. ఫామ్ ఫీలింగ్ అయి తర్వాత మీ యొక్క డాక్యుమెంటు తగిన సైజులో ఉన్నప్పుడు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద ఒక నంబరు కనిపిస్తుంది అది సేవ్ చేసుకొని రిజిస్ట్రేషన్ యొక్క స్టేటస్ను ఈ క్రింద చూపిన లింకు ద్వారా తెలుసుకొనవచ్చును
https://ceoaperolls.ap.gov.in/status_mlc_2023/search.aspx
📍 ఎలక్షన్ కార్డు డీటెయిల్స్ కూడా మీరు చేయాలనుకుంటే అసెంబ్లీ నీ తర్వాత మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ ని తర్వాత మీ పోలింగ్ బూత్ నెంబర్ ని మీ కార్డు మీద ఉంటుంది వాటి ద్వారా తెలుసుకోవచ్చును ఒకవేళ మీ కార్డులో పోలింగ్ స్టేషన్ నెంబరు పోలింగ్ బూత్ నెంబరు సరిగా అర్థం కాకపోతే ఈ క్రింది లింకు ద్వారా మీ యొక్క ఓటర్ కార్డ్ డీటెయిల్స్ మీ యొక్క ఓటర్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చును.
Comments
Post a Comment
Please share your feedback here