How M.O can verify MLHP Monthly performance report? what are the registers mlhp need to maintain ?
అందరికి నమస్కారం ..!
ఈరోజు మన టాపిక్ వచ్చి అస్సలు MLHP మంత్లీ రిపోర్ట్ ని మన MO గారు ఎలా వెరిఫై చేయాలి
1 .ఇందుకు మనకు ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా ?
ఎంతమందికి తెలుసో లేదో కానీ మనకు చాల స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి ... ఎక్కడ అంటే మన CHO INDUCTION MODULE లో
2 . ఐతే అందులో ఏమని ఉంది ?
మన module లో చాల స్పష్టంగా ప్రతి ఇండికేటర్ కి ఎక్కడ , ఎందులో లేక దేన్నీ చూసి ధృవీకరించాలి అనేది చెప్పడం జరిగింది .
ఇక్కడ మన M.O గారు ఎలా మన రిపోర్ట్స్ ని ఎలా ద్రువీకరించాలో అనేది చెప్పడం జరిగింది , వాళ్ళు Online Applications ద్వారా లేక సబ్ సెంటర్ రెజిస్టర్స్ ద్వారా కానీ చేయవచ్చు .
ఇక్కడ సబ్ సెంటర్ రెజిస్టర్స్ అని చెప్పడం జరిగింది కానీ MLHP రెజిస్టర్స్ అని చెప్పలేదు గమనించగలరు. దీనికి మరొక Example మన ఇండక్షన్ ట్రైనింగ్ module లోనే ఉంది .
1 . ONLINE SITES/ APPLICATIONS లో చూడటం
ఇంకా మరొక విషయం ఏంటి అంటే
1 . మేము చేస్తే మీకు ఇన్సెటివ్ ఎందుకు అని ? anms , supervisors అంటారు
2 . మీకు ఇన్సెంటివ్స్ ఉన్నాయ్ గ మీరు చేయండి ? M.O , CHO లు అంటున్నారు
సబ్ సెంటర్ కి హెడ్ MLHP అన్నపుడు సబ్ సెంటర్ యొక్క అన్ని సర్వీసెస్ ని బాగా నడపాలని అనే ఉద్దేశంతో MLHP సబ్మిట్ చేసే సబ్ సెంటర్ మంత్లీ పెర్ఫార్మన్స్ డేటా కి కొంత ఇన్సెంటివ్ గ చేర్చడం జరిగింది.
ఇక్కడ ఇచ్చింది ఆ సబ్ సెంటర్ ఇచ్చిన అన్ని సర్వీసెస్ కి , మరియు MLHP పర్యవేక్షణ కి ఇవ్వడం జరిగింది .
MLHP లు ఇచ్చేది మంత్లీ రిపోర్ట్ , ఇన్సెంటివ్ రిపోర్ట్ కాదు . వాటికీ కొంత అమౌంట్ ఉంది అంతే .
మీరు పైన ఇచ్నిన ఫోటో ని గమనిస్తే అందులో ASSESS MONTHLY PERFORMANCE OF HWC-SHC TEAM అని ఉంది దాని అర్థం ఏంటి , ఇంకా వెరిఫికేషన్ విషయానికి వస్తే M.O వెరిఫై చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి
అవి
1 . ONLINE SITES/ APPLICATIONS లో చూడటం
2 . HWC-SHC రెజిస్టర్స్ చూడటం
ఇప్పుడు చుడండి ఇక్కడ
***M.O లు ఇది తెలియక మన MLHPs ని sign కి వెళ్ళినపుడు ఇందులో ఉన్న అన్ని రెజిస్టర్స్ తేవాలి అని చెపడ్డం,
***మరీ హాస్యాస్పదం ఏంటి అంటే ఎన్ని ఇండికేటర్స్ ఉంటె అన్ని రికార్డ్స్ అని.......... , MLHPs రాకముందు కూడా ఈ రికార్డ్స్ ఉన్నాయా ? ఖచ్చితంగా ఉన్నాయి
***అందులో ఇంకొక విచిత్రం ఏంటి అంటే VHSNC మరియు VHND ఆశ రాసె రెజిస్టర్స్ గురించి తెలియక అవి కూడా రాయమనడం , VHSNC అండ్ VHND కి జనరల్ సెక్రటరీ ఆశ గా ఆశ మైంటైన్ చేస్తుంది , వచ్చిన వాళ్ళు అందులో సైన్ చేస్తారు.
ఇంకా ఏంటి అంటే MLHPS రాకముందు ANMs O .P కూడా రాసేవారు దీన్ని తెలివిగా ఆల్రెడీ MLHPS రాస్తున్నారీ గా మల్లి మేము రాయాల్సిన అవసరం లేదు అని తప్పించుకున్నాడు బాగుంది , ఇదే నియమము MLHPs కి ఎందుకు వర్తించదు? MLHPs సబ్ సెంటర్ హెడ్ అయినప్పుడు , ఆల్రెడీ MCH కి సంబందించిన డేటా anm మైన్టై చేస్తున్నపుడు ఇంకా MLHPs ఎందుకు రాయాలి ఒక ఆఫీస్ లో రెండు రికార్డ్స్ ఎందుకు ?
కావున సబ్ సెంటర్ హెడ్ ఐన MLHPs అడ్మినిస్ట్రేషన్ రికార్డ్స్ ఐన DRUG IDENT REGISTER , PERMANENT ఆర్టికల్స్ REGISTER , BIO MEDICAL WASTE MAINTANANCE REGISTER , ఇంకా OP ఇలాంటివి మైంటైన్ చేయాలి అని ఈ
M.O లకు ఎప్పుడు అర్థం అవుతుంది ? ఆన్లైన్ లో కూడా సులభంగా వెరిఫై చేయొచ్చు అని ఎప్పుడు తెలుస్తుంది ?
PLEASE BOOKMARK US FOR MORE UPDATES
https://mlhpandcho.blogspot.com/
Comments
Post a Comment
Please share your feedback here